
పార్వతీపురం , 16 ఫిబ్రవరి (హి.స.)
గ్యాస్ సిలిండర్లు లీకై ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం అంపావల్లి తాగునీటి పథకంలో గ్యాస్ సిలిండర్లు లీకయ్యాయి. దీంతో సమీపంలోని ఇళ్లలో నివాసం ఉంటున్న ఆరుగురు అస్వస్థతకు గురవ్వగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిని పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి, మరో ముగ్గురిని బలిజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. వైద్యులు ఆరుగురికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యచికిత్స అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మంత్రికి తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV