
శ్రీశైలం 16 ఫిబ్రవరి (హి.స.)ఆలయం, సున్నిపెంట సర్కిల్: పాతాళగంగలో పుణ్య స్నానమాచరించారు.. ప్రభోత్సవం చూసి తరించారు.. నంది వాహన సేవలో పాల్గొని పులకించిపోయారు.. పాగాలంకరణ వీక్షించి పరవశించిపోయారు.. దేవదేవుల కల్యాణ వేడుకను కనులారా తిలకించి మంత్రముగ్ధులయ్యారు. ఆదిదంపతుల బ్రహ్మోత్సవ కల్యాణం రాత్రి 12 గంటలకు మొదలైంది. వేదికపై ఉత్సవమూర్తులు కల్యాణశోభతో కొలువుదీరారు. అధికార యంత్రాంగం, భక్తజనులు బ్రహ్మోత్సవ ki కల్యాణ వేదిక ఎదుట ఆశీనులయ్యారు. ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు, వేదపండితులు, పరిచారకులు అంతా కలిసి భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవ కల్యాణాన్ని అత్యంత వైభవంగా నీ నిర్వహించారు. శ్రీశైల మల్లన్న తన ఇష్టసఖి భ్రామరీతో కలిసి బ్రహ్మోత్సవంలో నవదాంపత్యశోభతో భక్తజనులకు సాక్షాత్కరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ