ఒకే గ్రామానికి రెండు.పేర్లు బాపులపాడు హనుమాన్ జంక్షన్
అమరావతి, 16 ఫిబ్రవరి (హి.స.)ఒకే గ్రామానికి రెండు పేర్లు ఉండటమనేది బహుశా ఎక్కడా ఉండదు. గతంలో ఒక పేరు ఉండి, మార్పు, చేర్పుల తర్వాత మరొక పేరు వాడుకలోకి రావడం చాలా ప్రాంతాల్లో చోటుచేసుకుంది. కానీ బాపులపాడు గ్రామం రెండు పేర్లతో చెలామణిలో ఉండడం ఆసక్తికరమ
ఒకే గ్రామానికి రెండు.పేర్లు బాపులపాడు హనుమాన్ జంక్షన్


అమరావతి, 16 ఫిబ్రవరి (హి.స.)ఒకే గ్రామానికి రెండు పేర్లు ఉండటమనేది బహుశా ఎక్కడా ఉండదు. గతంలో ఒక పేరు ఉండి, మార్పు, చేర్పుల తర్వాత మరొక పేరు వాడుకలోకి రావడం చాలా ప్రాంతాల్లో చోటుచేసుకుంది. కానీ బాపులపాడు గ్రామం రెండు పేర్లతో చెలామణిలో ఉండడం ఆసక్తికరమే. బాపులపాడు కొన్ని దశాబ్దాల నుంచి హనుమాన్‌జంక్షన్‌గా ప్రాచుర్యం పొందుతోంది. నాలుగు రోడ్ల కూడలి ఉండడం, అభయాంజనేయస్వామి కొలువుదీరడంతో క్రమేణా హనుమాన్‌జంక్షన్‌గా మారిపోయింది. మండల కేంద్రంగా ఉండడంతో ప్రభుత్వ రికార్డులు, అధికారిక వ్యవహారాల్లోనూ ఇప్పటికీ బాపులపాడు పేరుతోనే కార్యకలాపాలు కొనసాగుతుంటాయి. బ్యాంకులు, ఆర్టీసీ బస్టాండ్, తపాలా కార్యాలయం మాత్రం హనుమాన్‌జంక్షన్‌ పేరుతో ఏర్పాటయ్యాయి. దీంతో ఇటీవల శివారులో నిర్మించిన స్వాగత గోడపై రెండు పేర్లతోనూ సూచికలు ఏర్పాటు చేయడం గమనార్హం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande