విశాఖ నావెల్ బేస్ లోని సాముద్రిక వద్ద మిలన్ విలేజ్
, విశాఖపట్నం , 16 ఫిబ్రవరి (హి.స) : తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ నావెల్‌ బేస్‌లోని సముద్రిక వద్ద మిలాన్‌ విలేజ్‌ ప్రారంభమైంది. ఇక్కడ ఏర్పాటు చేసిన రోబో కాఫీ స్టాల్‌ నౌకాదళ అధికారులు, సిబ్బందిని ఆకట్టుకుంది. దీని పేరు బీన్‌బోర్డు రోబ
విశాఖ నావెల్ బేస్ లోని సాముద్రిక వద్ద మిలన్ విలేజ్


, విశాఖపట్నం , 16 ఫిబ్రవరి (హి.స) : తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ నావెల్‌ బేస్‌లోని సముద్రిక వద్ద మిలాన్‌ విలేజ్‌ ప్రారంభమైంది. ఇక్కడ ఏర్పాటు చేసిన రోబో కాఫీ స్టాల్‌ నౌకాదళ అధికారులు, సిబ్బందిని ఆకట్టుకుంది. దీని పేరు బీన్‌బోర్డు రోబో. మనుషుల సహాయం లేకుండానే తనకు తానే యంత్రంలో కాఫీని పట్టి చేతితో ఇస్తుంది. ఫోన్‌పే ద్వారా డబ్బు in చెల్లించినవారు కాఫీ తీసుకొని తాగవచ్చు. త్వరలో ఇటువంటి రోబోను దిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం విమానాశ్రయాల్లో ఏర్పాటు చేయనున్నట్లు బీన్‌బోర్డు రోబో సంస్థ ప్రతినిధులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande