
అమరావతి, 17 ఫిబ్రవరి (హి.స.),:డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలను ఏపీపీఎస్సీ సోమవారం ప్రకటించింది. 38 పోస్టులకు 38 మందిని ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 24న సర్టిఫికెట్ల పరిశీలన చేపడతారు. సర్టిఫికెట్లను ధ్రువీకరించిన తర్వాత ఉద్యోగం పొందినట్లు ప్రకటిస్తారు. సాధారణంగా అన్ని నోటిఫికేషన్లలో సర్టిఫికెట్ల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తారు. వారిలో సగం మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అందుకు భిన్నంగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు ఒక పోస్టుకు ఒకరినే సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ