ప్రజా రవాణా సంస్థ ఎండీ గా పదవీ విరమణ చేయనున్న ద్వారక తిరుమల రావు
విజయవాడ 17 ఫిబ్రవరి (హి.స.), :ప్రజా రవాణా సంస్ధ (ఆర్టీసీ) ఎండీగా పదవీ విరమణ చేయనున్న ద్వారకా తిరుమలరావుకు ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీసీ హౌస్‌లో వీడ్కోలు సత్కారం నిర్వహించారు. నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు పాటు ఆయన విశేష సేవ
ప్రజా రవాణా సంస్థ ఎండీ గా పదవీ విరమణ చేయనున్న ద్వారక తిరుమల రావు


విజయవాడ 17 ఫిబ్రవరి (హి.స.), :ప్రజా రవాణా సంస్ధ (ఆర్టీసీ) ఎండీగా పదవీ విరమణ చేయనున్న ద్వారకా తిరుమలరావుకు ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీసీ హౌస్‌లో వీడ్కోలు సత్కారం నిర్వహించారు. నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు పాటు ఆయన విశేష సేవలు అందించారని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి పెద్దపీట వేశారని.. ఉద్యోగుల్లో ఆత్మస్తైర్యాన్ని నింపి ఆర్టీసిని ముందుకు నడిపించారని కొనియాడారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన స్త్రీ-శక్తి పథకాన్ని విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించి సంస్థకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి ద్వారకా తిరుమల రావు కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య, డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ యం.డి.ప్రసాద్‌ వీరితో పాటు యూనియన్‌ రాష్ట్ర, జోన్‌, జిల్లా నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande