మంగళగిరిలో ప్రజారోగ్య అత్యవసర సేవల. కేంద్రం
అమరావతి, 17 ఫిబ్రవరి (హి.స.) అమరావతి, రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అంటువ్యాధులు ప్రబలినప్పుడు, కొవిడ్‌ లాంటి అసాధారణ పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలకు ఆరోగ్యశాఖ సంసిద్ధమైందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార
మంగళగిరిలో ప్రజారోగ్య అత్యవసర సేవల. కేంద్రం


అమరావతి, 17 ఫిబ్రవరి (హి.స.)

అమరావతి, రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అంటువ్యాధులు ప్రబలినప్పుడు, కొవిడ్‌ లాంటి అసాధారణ పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలకు ఆరోగ్యశాఖ సంసిద్ధమైందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఇలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మంగళగిరిలో ‘‘ప్రజారోగ్య అత్యవసర సేవల కేంద్రం’’ (పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా ఏర్పాటైన ఈ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌లో ఆరోగ్యశాఖ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఫైరింగ్‌, పోలీసు, ఇతర శాఖల సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. అత్యవసర సమయాల్లో బాధితులకు వైద్య సేవలందించే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశామన్నారు. పీఎం అభిమ్‌ (ప్రధాన మంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌ మిషన్‌) కింద రూ.5 కోట్ల నిధులతో ఏర్పాటు చేశామని, త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande