తూర్పు గోదావరి జిల్లాలో.పట్టుబడిన పెద్దపులి నీ పాపికొండల అడవుల్లో విడిచిపెట్టారు
అమరావతి, 17 ఫిబ్రవరి (హి.స.), : తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల పట్టుబడిన పెద్దపులిని పాపికొండలు అడవుల్లో విడిచిపెట్టారు. బోనులో ఉంచిన పులిని విశాఖ నుంచి రోడ్డు మార్గం గుండా తరలించారు. రెండు రోజుల కిందటే దాన్ని తరలించగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప
తూర్పు గోదావరి జిల్లాలో.పట్టుబడిన పెద్దపులి నీ పాపికొండల అడవుల్లో విడిచిపెట్టారు


అమరావతి, 17 ఫిబ్రవరి (హి.స.), : తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల పట్టుబడిన పెద్దపులిని పాపికొండలు అడవుల్లో విడిచిపెట్టారు. బోనులో ఉంచిన పులిని విశాఖ నుంచి రోడ్డు మార్గం గుండా తరలించారు. రెండు రోజుల కిందటే దాన్ని తరలించగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పులి కదలికలను గమనించేందుకు రేడియో కాలర్‌ ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల వైద్యుల పర్యవేక్షణలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాక ఆరోగ్యంగా ఉన్నట్లు తేలడంతో అటవీశాఖ అధికారులు ఇక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేశారు. తరలింపు విషయాన్ని జూ అధికారులు రహస్యంగా ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి. కొన్నిరోజుల పాటు తూర్పుగోదావరి జిల్లా ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేసిన పులిని ఈ నెల 6న మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కూర్మాపురంలో పట్టుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande