నేడు మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 17 ఫిబ్రవరి (హి.స.) తెలంగాణ మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ (KCR) జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ''X'' (ట్విట్టర్) వేదికగా స్పెషల్ విషెస్ చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిప
CM


హైదరాబాద్, 17 ఫిబ్రవరి (హి.స.)

తెలంగాణ మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ (KCR) జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా స్పెషల్ విషెస్ చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ, రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కృషిని కొనసాగించాలని కోరుకుంటున్నా. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా ఆకాంక్షిస్తున్నా' అంటూ సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. మరోవైపు కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్తో పాటు జిల్లా కేంద్రాల్లో ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande