మెడికల్. పేజీ కి.సంబంధించి కన్వీనర్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్
అమరావతి, 17 ఫిబ్రవరి (హి.స.) అమరావతి,): మెడికల్‌ పీజీకి సంబంధించి కన్వీనర్‌ కోటా, మేనేజ్‌మెంట్‌ కోటాలో మిగిలిపోయిన సీట్లను మాప్‌-అప్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేసేందుకు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ సిద్ధమైంది. ఈ మేరకు హెల్త్‌ వర్సిటీ రిజి
మెడికల్. పేజీ కి.సంబంధించి కన్వీనర్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్


అమరావతి, 17 ఫిబ్రవరి (హి.స.)

అమరావతి,): మెడికల్‌ పీజీకి సంబంధించి కన్వీనర్‌ కోటా, మేనేజ్‌మెంట్‌ కోటాలో మిగిలిపోయిన సీట్లను మాప్‌-అప్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేసేందుకు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ సిద్ధమైంది. ఈ మేరకు హెల్త్‌ వర్సిటీ రిజిస్టార్‌ డాక్టర్‌ టి.సాయిసుధీర్‌ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు వర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోలని సూచించారు. మరోవైపు ఇప్పటి వరకూ సీట్లు పొందిన అభ్యర్థులు వారి స్థానాల్లో కచ్చితంగా చేరాలన్నారు. మేనేజ్‌మెంట్‌ కోటా నుంచి కన్వీనర్‌ కోటా సీటు పొందిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారి మేనేజ్‌మెంట్‌ కోటా సీటును ఖాళీగా పరిగణిస్తామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande