రాష్ట్రంలోని.డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త
అమరావతి, 17 ఫిబ్రవరి (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. మహిళా సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో మార్చి 8న రెండు కీలక సంక్షేమ పథకాలను ప్రారంభించనుంది. మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భ
రాష్ట్రంలోని.డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త


అమరావతి, 17 ఫిబ్రవరి (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. మహిళా సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో మార్చి 8న రెండు కీలక సంక్షేమ పథకాలను ప్రారంభించనుంది. మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ప్రవేశపెట్టనున్న ఈ పథకాలు మహిళల కుటుంబ, విద్యా అవసరాలకు ఆర్థిక భరోసా కల్పించనున్నాయి.

ప్రభుత్వం ప్రారంభించనున్న ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకాలు టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత నేత ఎన్టీఆర్ పేరుతో అమలు చేయబడనున్నాయి. వీటి ద్వారా డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలకు ప్రత్యేక రుణ సౌకర్యం అందించనున్నారు. కళ్యాణలక్ష్మి పథకం కింద మహిళల పిల్లల వివాహాల కోసం కనిష్ఠంగా రూ.10,000 నుంచి గరిష్టంగా రూ.1,00,000 వరకు రుణం మంజూరు చేయబడుతుంది. ఈ రుణాన్ని 48 నెలల వాయిదాల్లో తిరిగి చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande