న్యూఢిల్లీ-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. దగ్ధమైన బోగీ
ముంబయి,17 ,ఫిబ్రవరి (హి.స.) మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో న్యూఢిల్లీ-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. ఎస్‌ఎల్ఆర్ కోచ్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణికులు, సిబ్బంది షాక్‌కు గురయ్యారు. వెంటనే డ్రైవర్ నిలిపివేయడంతో ప్రయాణికులంత
న్యూఢిల్లీ-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. దగ్ధమైన బోగీ


ముంబయి,17 ,ఫిబ్రవరి (హి.స.) మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో న్యూఢిల్లీ-చెన్నై ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. ఎస్‌ఎల్ఆర్ కోచ్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణికులు, సిబ్బంది షాక్‌కు గురయ్యారు. వెంటనే డ్రైవర్ నిలిపివేయడంతో ప్రయాణికులంతా కిందకు దిగేశారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపులో చేశారు. మంటలకు బోగీ దగ్ధమైంది. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేదని అధికారులు చెప్పారు.

మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో మంగళవారం ఉదయం న్యూఢిల్లీ-చెన్నై గ్రాంట్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో మంటలు చెలరేగాయని రైల్వే అధికారులు తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. ప్రమాదం జరగగానే స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మొబైల్స్‌లో బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande