పదవుల కోసం కాంగ్రెస్, బీజేపీల అక్రమ పొత్తు.. మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్, 17 ఫిబ్రవరి (హి.స.) మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కోసం కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP)లు అక్రమ పొత్తు పెట్టుకున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) ధ్వజమెత్తారు. ఇవాళ నగరంలోని తెలంగాణ భవన్లో కేసీఆర్ (KCR) జన్మది
Harish Rao


హైదరాబాద్, 17 ఫిబ్రవరి (హి.స.)

మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్

పదవులు కోసం కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP)లు అక్రమ పొత్తు పెట్టుకున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) ధ్వజమెత్తారు. ఇవాళ నగరంలోని తెలంగాణ భవన్లో కేసీఆర్ (KCR) జన్మదినం సందర్భంగా ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారు కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం, పదేళ్ల పాలనపై డాక్యుమెంటరీ విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇవాళ కాంగ్రెస్, బీజేపీకు పార్టీలకు ఎలాంటి సిద్ధంతాలు లేవని.. మున్సిపాలిటీ ఎన్నికల్లో రెండు పార్టీల నేతలు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాయని కామెంట్ చేశారు. తెలంగాణ కోసం ఉద్యమ నేత కేసీఆర్ పదవులను గడ్డిపోచలా వదిలేశారని అన్నారు. చరిత్రలో కేసీఆర్ తిన్నన్ని తిట్లు, శాపనార్థాలు ఎవరూ తినలేదని.. భవిష్యత్తులో కూడా తినకపోవచ్చునేమోనని పేర్కొన్నారు. కేసీఆర్పై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. మొండి ధైర్యంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి అశేష తెలంగాణ ప్రజలకు చూపారని హరీశ్ రావు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande