'నాన్న' అని రాయలేరా అక్కా? కేసీఆర్ బర్త్ డే వేళ కవిత ట్వీట్పై నెటిజన్ల ఫైర్
హైదరాబాద్, 17 ఫిబ్రవరి (హి.స.) బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల వేళ ఆయన కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla kavitha) చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తండ్రికి పుట్టిన
Kavita


హైదరాబాద్, 17 ఫిబ్రవరి (హి.స.)

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల వేళ ఆయన కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla kavitha) చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తీరుపై నెటిజన్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సాదాసీదాగా విష్ చేసిన కవిత..

సాధారణంగా కేసీఆర్ పుట్టినరోజున కవిత సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు, ఫోటోలు షేర్ చేస్తుంటారు. అయితే, ఈ సారి అందుకు భిన్నంగా వ్యవహరించారు. తన ట్విట్టర్ (X) ఖాతాలో.. 'ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు' అంటూ రాసుకొచ్చారు. కనీసం కేసీఆర్ ఫోటో కూడా జత చేయకపోవడం, సొంత తండ్రిని 'నాన్న' అని సంబోధించకపోవడం గమనార్హం.

భగ్గుమంటున్న నెటిజన్లు...

కవిత చేసిన ఈ 'అఫీషియల్' ట్వీట్పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తండ్రిని తండ్రిగా పిలవలేని నిస్సహాయత ఎందుకంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 'సొంత తండ్రిని నాన్న అని రాయలేరా అక్కా.. ఆ మాత్రం పిలిచే స్థాయి కూడా లేదా?' అని ఒకరు ప్రశ్నించగా.. 'ముందు ఆయన మీకు నాన్న కదా.. నాన్న అని సంబోధిస్తే బాగుండేది. ఫొటో దేవుడెరుగు కనీసం ఆప్యాయంగా పిలిచే మనసు కూడా రావడం లేదా?' అని మరొకరు కామెంట్ చేశారు. మరికొందరు సెటైరికల్గా.. 'ఈ ట్వీట్ సీఎం రేవంత్ రెడ్డి రాసిచ్చారా? లేక ఆయన ఖాతా నుంచి కాపీ కొట్టారా?' అంటూ ఎద్దేవా చేస్తున్నారు. కాగా, కేసీఆర్ పుట్టిన రోజు కవిత చేసిన ఈ ట్వీట్, రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande