తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. వివరాలు వెల్లడించిన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, 17 ఫిబ్రవరి (హి.స.) పెట్టుబడులు రావద్దని కొందరు దుష్ప్రచారం చేస్తున్నా తెలంగాణకు పెట్టుబడులు (Investments) వెల్లువెత్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. తాజాగా యూఎస్ కు చెందిన ట్రైడెంట్ ఏఐ (Trident Al) కంపెనీ రూ.300 క
మంత్రి శ్రీధర్ బాబు


హైదరాబాద్, 17 ఫిబ్రవరి (హి.స.)

పెట్టుబడులు రావద్దని కొందరు దుష్ప్రచారం చేస్తున్నా తెలంగాణకు పెట్టుబడులు (Investments) వెల్లువెత్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. తాజాగా యూఎస్ కు చెందిన ట్రైడెంట్ ఏఐ (Trident Al) కంపెనీ రూ.300 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుందని, ఆర్ఎక్స్ ప్రొపెల్లంట్ రూ.1000 కోట్లు, ఫ్రాజెన్స్ కు చెందిన గ్లోబల్ హెల్త్ కేర్ కంపనీ ఒపెల్లా వంటి సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయాని తెలిపారు. ఇది రాష్ట్రానికి శుభ సూచకం అని ఈ పెట్టుబడులతో స్థానికంగా ఉపాధి అవకాశాలను పెరుగుతాయన్నారు. ఇవాళ హైటెక్స్ లో బయో ఆసియా సదస్సు-2026 ప్రారంభం (BioAsia 2026) అనంతరం మీడియాతో మాట్లాడారు.

లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ :

బయో ఆసియా 2026 సదస్సులో పారిశ్రామిక వేత్తలు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు ఎంతో ఉత్సాహం పాల్గొన్నారని శ్రీధర్ బాబు చెప్పారు. టెక్నాలజీతో భౌగోళిక, ఆర్థిక, రాజకీయ మార్పుకు అనుగుణంగా సదస్సు విజన్ పెట్టుకున్నామన్నారు. లైఫ్ సైన్సెస్ కంపెనీలు.. ఏఐ టెక్నాలజీ వినియోగించుకుని ముందుకు వెళ్లాలన్నారు. హెల్త్ కేర్.. ప్రజలకు అందుబాటులో ఉంచాలనేదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. 25 బిలియన్ డాలర్స్ పెట్టుబడులు సాధించాలన్నదే తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ టార్గెట్ అని చెప్పారు. త్వరలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.:

మౌలిక హైదరాబాద్ ను లైఫ్ సైన్సెస్, ఫార్మా హబా మార్చాలన్నదే మా లక్ష్యం అని మార్పులకు అనుగుణంగా.. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో మెరుగైన టెక్నాలజీని ఉపయోగించుకుంటామన్నారు. జినోమ్ వ్యాలీ ఫేజ్ 4 ను వంద ఎకరాలతో విస్తరించ బోతున్నామని చెప్పారు. అత్యాధునిక వసతులతో జీనోమ్ వ్యాలీ ఫేజ్ 4 ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 2035 నాటికి 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లైఫ్ సైన్సెస్ రంగంలో ఆకర్షించేందుకు ప్రణాళిక పెట్టుకున్నామన్నారు. కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించే లక్ష్యంతో ఉన్నామని తెలంగాణను ప్రపంచంలోని టాప్-3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా నిలుపుతామన్నారు.

ఔషధాల పరిశోధన కేంద్రంగా HYD:

ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ వంటి ఆధునిక రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా రెడీ టు వర్క్ వర్క్ ఫోర్స్ సిద్ధం చేస్తామన్నారు. CBRI గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ 2025 ప్రకారం హైదరాబాద్ గ్లోబల్ హబ్ల సరసన నిలిచిందన్నారు. ఉత్పత్తి మాత్రమే కాకుండా కొత్త ఔషధాల పరిశోధన కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande