నల్లగొండలో కోమటిరెడ్డి మార్క్ అభివృద్ధి.. తెల్లవారుజాము నుంచే యాక్షన్లోకి
నల్గొండ, 17 ఫిబ్రవరి (హి.స.) జిల్లా కేంద్రాన్ని ''సూపర్ స్మార్ట్ సిటీ''గా మార్చడమే లక్ష్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు వెడల
కోమటి రెడ్డి


నల్గొండ, 17 ఫిబ్రవరి (హి.స.)

జిల్లా కేంద్రాన్ని 'సూపర్ స్మార్ట్ సిటీ'గా మార్చడమే లక్ష్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) అభివృద్ధి పనుల్లో వేగం పెంచారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు వెడల్పు, పారిశుధ్య పనులను మంత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ముగిసి, మేయర్ ఎన్నిక పూర్తి కాగానే మంత్రి కోమటిరెడ్డి నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే ఆయన అధికారులతో కలిసి నగరంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే ప్రకాశం బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పనులను ముమ్మరం చేశారు.

ప్రకాశం బజార్లో ఆక్రమణల తొలగింపు..

నగరంలో ప్రధాన వ్యాపార కూడలి అయిన ప్రకాశం బజార్ (Prakasam Bazar)లో రోడ్లు ఇరుకుగా ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన మంత్రి, సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. జేసీబీలతో ఆక్రమణలను తొలగించి, రోడ్లను వెడల్పు చేసే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని డివైడర్లను తొలగించాలని, తక్షణమే సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఇకపై విద్యుత్ తీగల ఇబ్బంది లేకుండా భూగర్భ విద్యుత్ వ్యవస్థను (Underground Cabling) 2 చేయాలని అధికారులకు సూచించారు. రోడ్డు వెడల్పు వల్ల పూలు, పండ్ల వ్యాపారులు ఉపాధి కోల్పోకుండా మంత్రి మానవీయ కోణంలో నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారులందరికీ ప్రత్యామ్నాయం చూపిస్తామని అన్నారు. పాత కలెక్టరేట్ కార్యాలయ స్థలంలో తక్షణమే సిసి ఫ్లోరింగ్ పూర్తి చేసి, వారికి కేటాయించాలని అధికారులను ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande