
తెలంగాణ, 17 ఫిబ్రవరి (హి.స.)
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజార్టీతో 17 పురపాలికలను కైవసం చేసుకున్నది. పోలింగ్ వేళ సాధించిన స్థానాలనే కాపాడుకోగలిగింది. మరో 11 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడగా వాటిలో మరో 8 వరకు మున్సిపాలిటీలను దక్కించుకుంటామని పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికి ఎల్లంపేట, అలంపూర్, జమ్మికుంట, సిరిసిల్ల, ఇస్నాపూర్, తూప్రాన్, గజ్వేల్, దుబ్బాక, రాయికల్, ఆసిఫాబాద్, అయిజ, గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, మూడుచింతలపల్లి, చేర్యాల, మున్సిపాలిటీల్లో గులాబీ తిరుమలగిరి ఎగరేసింది.
కాగా ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్నగర్, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరులో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అయితే.. వీటిలో క్యాతనపల్లి, ఇంద్రేశం, జహీరాబాద్, ఇబ్రహీంపట్నం, జనగామ, తొర్రూరు, ఖానాపూర్, కాగజ్నగర్ స్థానాలు తమకే దక్కుతాయని పార్టీ ఆశలు పెట్టుకున్నది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు