పుర పోరులో చిత్ర విచిత్రాలు.. గెలుపు కోసం 'శత్రువు'లతో దోస్తీ!
హైదరాబాద్, 17 ఫిబ్రవరి (హి.స.) సిద్ధాంతాలు, ప్రజల ఆశలు,ఆశయాలు, అభివృద్ధి, సంక్షేమ నినాదాలతో రాజకీయ పార్టీలను స్థాపిస్తుంటారు. పార్టీల్లో వ్యక్తులు, నాయకులు మారుతున్నా.. సిద్ధాంతాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఏదైన విషయంలో, విధానపరమైన నిర్ణయాల్లో అప్పు
మున్సిపల్


హైదరాబాద్, 17 ఫిబ్రవరి (హి.స.)

సిద్ధాంతాలు, ప్రజల ఆశలు,ఆశయాలు, అభివృద్ధి, సంక్షేమ నినాదాలతో రాజకీయ పార్టీలను స్థాపిస్తుంటారు. పార్టీల్లో వ్యక్తులు, నాయకులు మారుతున్నా.. సిద్ధాంతాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఏదైన విషయంలో, విధానపరమైన నిర్ణయాల్లో అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా చిత్ర, విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలతో పాటు తాజాగా జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రజల సంక్షేమంతో సంబంధం లేకుండా కేవలం పదవులు దక్కించుకోవడమే లక్ష్యంగా నేతలు ముందుకు సాగుతున్నారు. పదవులు కొనుక్కోవడం, అమ్ముకోవడం సాధారణం అయిపోయింది. గెలిచిన అభ్యర్థులను ఎంతకైనా కొనేందుకు.. భారీగా ఇస్తే అమ్ముడు పోవడానికి రెడీ అంటూ కొందరు నేతలు బహిరంగంగానే చర్చనీయాంశమైంది. ప్రకటనలు చేస్తుండటం

పదవే ముఖ్యం

ఒక రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు మున్సిపల్ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో పొత్తులు పెట్టుకున్నాయి. ఒక పార్టీ మున్సిపాలిటిలో మరో పార్టీతో పొత్తు పెట్టుకుంటే నిరంతరం తీవ్ర ఆరోపణలు చేసుకునే పార్టీలు సైతం ఇంకో మున్సిపాలిటీలో పొత్తు పెట్టుకొని కౌన్సిలర్లను గెలుచుకున్నాయి. కౌన్సిలర్లు గెలుచుకున్న పార్టీలు, అభ్యర్థులు తమకు ఇంకా మంచి పదవి ఇస్తే ఏ పార్టీలోనైనా చేరుతాం అని ప్రకటించడం గమనార్హం.

సై అంటే సై అంటూనే..

రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్నేతలు బద్ద శత్రువుల్లా కనిపిస్తారు. వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలతో సై అంటే సై అంటుంటారు. కానీ మున్సిపల్చైర్మన్, వైస్చీర్మన్ విషయంలో పొత్తులు పెట్టుకుని జనాలను ఆశ్చర్యపరిచారు. బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటై పదవులను కైవసం చేసుకున్నారు. మరికొన్ని చోట్ల కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటై మున్సిపాలిటీని దక్కించుకున్నాయి. జాతీయ స్థాయిలో తీవ్రమైన సిద్ధాంత వైరుధ్యం ఉన్న కాంగ్రెస్-బీజేపీలు సైతం ఒక్కటయ్యాయి. జిల్లా స్థాయిలో పదవే ముఖ్యంగా పావులు కదిపాయి. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ పుట్టిన పార్టీనే బీజేపీ. కాగా, అలాంటి పార్టీకి చెందిన వారు కాంగ్రెస్తో జతకట్టడం విశేషం.

కమ్యూనిస్టులు సైతం

కమ్యూనిస్టు పార్టీలు సిద్ధాంతపరంగానే వ్యవహరిస్తాయని, నాయకులకు పదవులు, అధికారం ముఖ్యం కాదనే పేరు ఉంది. కానీ ఈ ఎన్నికల్లో వాటన్నింటికీ తిలోదకాలు ఇచ్చారనే అపవాదును, విమర్శలను మూటకట్టుకున్నారు. సీపీఐ, సీపీఎంలు కూడా సిద్ధాంతాన్ని వదిలేసి తప్పుదారి పట్టాయని పలువురు మండిపడుతున్నారు. సీపీఐ, సీపీఎం ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి. సీపీఐ కొన్నిచోట్ల కాంగ్రెస్తో, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. సీపీఎం కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్తో వేరు వేరు మున్సిపాలిటీల్లో జతకట్టింది.పక్తు రాజకీయమే..

ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తే వారితోనే పొత్తు అంటూ చర్చలు, బెరసారాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని, తమకు అధికారం, పదవులు పరమావది కాదని చెప్పుకొలేని పరిస్థితికి చేరుకున్నాయి. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఇదే రూల్ పాటించాయి. తెలంగాణ ఏర్పాటు కోసం పుట్టినట్లు చెప్పుకునే బీఆర్ఎస్సైతం చివరివరకు సమైఖ్యవాదాన్ని వినిపించినా.. చివరకు సీపీఎంతో పొత్తు పెట్టుకుంది. ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుందనే భయంతో జనసేనతో ముందుకు సాగడానికి బీజేపీ నేతలు వెనకడుగు వేశారు. తెలంగాణ వాదులతో కలిసేందుకు ముందుకురాలేదు. కానీ, బీఆర్ఎస్మత్రం వాటిని పట్టించుకోకుండా తమది పక్తు రాజకీయ పార్టీ అనే విధానంతో ముందుకు సాగినట్లుగా విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande