నాణ్యమైన విద్య పౌష్టికాహారాన్ని అందించాలి: నాగర్ కర్నూల్ కలెక్టర్
నాగర్ కర్నూల్, 17 ఫిబ్రవరి (హి.స.) విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజన పరిసరాల పరిశుభ్రత ఉండేలా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్టీ గురుకుల బాలికల పాఠశాల యాజమాన్యానికి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం అచ
Collector


నాగర్ కర్నూల్, 17 ఫిబ్రవరి (హి.స.) విద్యార్థులకు మెరుగైన విద్యతో

పాటు నాణ్యమైన భోజన పరిసరాల పరిశుభ్రత ఉండేలా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్టీ గురుకుల బాలికల పాఠశాల యాజమాన్యానికి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం అచ్చంపేట మండల పరిధిలోని ఐనోల్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేసి, వసతులు, భోజన నాణ్యత, మరియు పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై కలెక్టర్ బాదావత్ సంతోష్ తీసి, నాణ్యమైన విద్యను, పౌష్టికాహారాన్ని అందించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. అలాగే కిచెన్ షెడ్, కూరగాయలు, బియ్యం, పప్పులు, ఇతర సామగ్రిని పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో మెనూ ప్రకారం వంటలు చేయాలన్నారు.

సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి..

నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. వంట విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయవద్దని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న పదవ తరగతిలో పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా బాలికలను సంసిద్ధం చేయాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. 100% ఉత్తీర్ణత సాధించాలని, పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చేలా కృషి చేయాలని కోరారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా విద్యావంతురాలు కావాలని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలని.. కలెక్టర్ ఈ సందర్భంగా విద్యార్థినులకు సూచించారు. తరగతి గదిలో విద్యార్థుల గణిత, ఆంగ్ల సామర్థ్యాలను కలెక్టర్ పరిశీలించారు. సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande