
తెలంగాణ, 17 ఫిబ్రవరి (హి.స.)
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని యెల్లారెడ్డి మినహా నిజామాబాద్ కార్పొరేషన్ సహా ఆర్మూర్, బోధన్, భీమ్గల్, కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మహిళలే ఆరు మున్సిపాలిటీలలో మహారాణులై కొలువుదీరారు. రిజర్వేషన్లలో భాగంగా మహిళలకు అవకాశాలు దక్కడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ గా కూరగాయల ఉమారాణి, డిప్యూటీ మేయర్ గా సల్మా హసీన్ ఎన్నికయ్యారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో గోనె లహరి చైర్ పర్సన్ గా, రెడ్డి వైస్ చైర్మన్ గా కాట్పల్లి వెంకట్, భీమ్గల్ మున్సిపాలిటీలో చైర్ పర్సన్ గా బొదిరె నాగమణి, వైస్ చైర్ పర్సన్ గా సంటి లత, బోధన్ మున్సిపాలిటీలో చైర్ పర్సన్ గా తూము పద్మావతి, వైస్ చైర్మన్ గా మీర్ ఇలియాస్ అలీ, కామారెడ్డి మున్సిపాలిటీ చైర్ పర్సన్ గాఇప్ప ఉమారాణి, వైస్ చైర్ పర్సన్ గా కాసర్ల గోదావరి, బాన్సువాడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా కాసుల విజయ, వైస్ చైర్ పర్సన్ గా రేష్మా బేగం, బిచ్కుంద మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా సీమా షెట్కర్, వైస్ చైర్ పర్సన్ గా భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు. ఇక ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో చైర్మన్ గా పద్మ శ్రీకాంత్, వైస్ చైర్ పర్సన్గా మట్టమాల భాగ్యవతి ఎన్నికయ్యారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు