
హైదరాబాద్, 17 ఫిబ్రవరి (హి.స.)తాడిపత్రి నియోజకవర్గాన్ని టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమగా మారుద్దామని మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బుగ్గరామలింగేశ్వరస్వామి, చింతల వెంకటరమణస్వామి, ఆలూరుకోన రంగనాథస్వామి, అశ్వత్థనారాయణ స్వామి, చక్రభీమలింగేశ్వరసామి ఆలయాలు ఇక్కడ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు అని తెలిపారు. ఆయా ఆలయాలకు సంబంధించి తిరునాళ్లు కూడా బాగగా జరుగుతున్నాయన్నారు.
ఆలయాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పన కోసం ఎమ్మెల్యే అశ్మిత్‌రెడ్డి చాల కష్టపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే దేవదాయ శాఖ అధికారులు, టీటీడీ అధికారులతో కూడా చర్చించినట్లు వెల్లడించారు. దాదాపు రూ.8కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఆలయాల వద్ద గదుల నిర్మాణానికి దాతలు చాల మంది ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ప్రజల సహకారంతో ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్