కేసీఆర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ బర్త్ డే విషెస్
అమరావతి, 17 ఫిబ్రవరి (హి.స.) తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR)కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జీవితాంతం ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్
కేసీఆర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ బర్త్ డే విషెస్


అమరావతి, 17 ఫిబ్రవరి (హి.స.)

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR)కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జీవితాంతం ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా కేసీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో ఉన్న నాయకుడైన కేసీఆర్ కు.. మరింత సేవ చేసే శక్తిని, సంపూర్ణ ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సైతం కేసీఆర్ కు ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆరోగ్యం, ప్రశాంతత జీవితాంతం ఆ దేవుడివ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు పోస్టులో జగన్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande