
అమరావతి, 17 ఫిబ్రవరి (హి.స.)
ఏపీ శాసనమండలి సమావేశాలు రెండ్రోజుల విరామం తర్వాత నేటి ఉదయం 11 గంటల పునఃప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే.. వైసీపీ నేతలు తిరుమల కల్తీ నెయ్యి అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. దీంతో సభలో గందగోళం నెలకొంది. కల్తీ నెయ్యిపై చర్చించాల్సిందేనంటూ నినాదాలు చేస్తూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల నెయ్యి సరఫరాపై వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా.. ఛైర్మన్ దానిని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులంతా ప్లకార్డులతో ఆయన పోడియంను చుట్టుముట్టారు. ఆందోళన నేపథ్యంలో ఛైర్మన్ శాసనమండలిని వాయిదా వేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV