
అద్దంకి, , 18 ఫిబ్రవరి (హి.స.):బెంగళూ రు-కడప-విజయవాడ(బీకేవీ) గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతుం డటంతో భూములు కోల్పోయి పరిహారం అందని రైతులలో ఆందోళన నెలకొంది. పరిహారం విషయాన్ని పలుమార్ల్లు అధికారులు, రోడ్డు నిర్మాణాన్ని పర్యవేక్షించే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన అంతంతమాత్రంగా ఉందని రైతులు వాపోతున్నారు.
ప్రధానంగా అద్దంకి పట్టణ సమీపం నుంచి గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు వెళ్తుండటం, నామ్ రోడ్డు క్రాస్ చేసే ప్రాంతంలో ఛేంజ్ ఓవర్ రింగ్ ఏర్పాటు చేస్తుండటంతో పెద్దమొత్తంలో భూసేకరణ జరిగింది. అది అత్యంత విలువైన ఇళ్ల స్థలాలుగా అమ్మకాలు జరిగే భూమి కాగా పరిహారం చెల్లింపులో మాత్రం పంట పొలాలుగా నమోదైంది. దీంతో పరిహారం అత్యల్పంగా ఉంది. కొటికలపూడి, తిమ్మారెడ్డిపాలెం వద్ద పంట పరిహారానికి సంబంధించి అవార్డు ప్రకటన కూడా జరిగింది. కొంతమంది రైతులకు పరిహారం చెల్లింపు మాత్రం జరగలేదు. అప్పట్లో సాగుచేసిన సుబాబుల్ తోటలకు పరిహారం అంచనా వేస్తూ అవార్డు ప్రకటన చేశారు. సాంకేతిక కారణాలతో చెల్లింపు ఆలస్యమైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ