
అమరావతి, 18 ఫిబ్రవరి (హి.స.)
మోతుగూడెం : సీలేరు, అనుబంధ జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉంది. అనంతగిరి కొండల్లో పుట్టిన మాచ్‌ఖండ్ (సీలేరు) నది ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల్లోని సరిహద్దులను తాకుతూ 320 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. సీలేరు నదికి సహజసిద్ధమైన ప్రవాహం వాలు ఎక్కువగా ఉన్నందువల్ల విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణానికి వీలు కలిగింది. మాచ్‌ఖండ్ వద్ద జలాశయం ఎత్తు 2,750 అడుగులు ఉండగా, పొల్లూరు వద్ద 267 అడుగులు ఉంటుంది. ఈ నది 200 మైళ్ల దూరం వరకు 2,500 అడుగుల ఎత్తు నుంచి వాలుగా ప్రవహిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ