
అమరావతి, 18 ఫిబ్రవరి (హి.స.)
ప్రొద్దుటూరు, : సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాల సమస్య వెంటాడుతోంది. కొన్ని చోట్ల ఎప్పుడో నిర్మించిన పాత భవనాలు శిథిలావస్థకు చేరాయి. పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. వర్షానికి ఉరుస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు సొంత భవనాల నిర్మాణానికి కూటమి సర్కారు చర్యటు పేట్టింది. ప్రధాన మంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ్ యోజన (పీఎం అజయ్) నిధులు రూ.18 కోట్లు కేటాయింది. వైఎస్సార్ కడప జిల్లాలో ప్రొద్దుటూరు, కలసపాడు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మనబోలు, తిరుపతి జిల్లాలో చంద్రగిరి, చిత్తూరు జిల్లాలో పలమనేరు, గుడియాతంల్లో కలిపి మొత్తం ఆరు భవనాలు నిర్మించనున్నారు.
వంది మంది విద్యార్థులు వసతి పొందేందుకు ఒక్కొక్క భవనానికి రూ.3 కోట్లు ఖర్చు చేసి ప్రొద్దుటూరు సంజీవనగర్, కలసపాడులో జీ+1 తరహాలో భవన నిర్మాణాలు చేపట్టారు. సెప్టెంబర్ 2025 నుంచి జూన్ 2026లోపు భవనాలు పూర్తి చేయాలని గడువు ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ప్రొద్దుటూరులో పాడుబడిన ఎస్సీ బాలికల వసతి భవనాన్ని కూల్చివేశారు. ఆ స్థలంలో కొత్త భవనాన్ని చేపట్టారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ పూర్తయి పై అంతస్తుకు పిల్లర్ల పనులు సాగుతున్నాయి. ఇదే మాదిరి కలసపాడు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్ణీత గడువులోపు భవనాలను పూర్తి చేసి వసతి గృహాలకు అందుబాటులోకి తేవాలని విద్యార్థులు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ