కరీంనగర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు..
కరీంనగర్, 18 ఫిబ్రవరి (హి.స.)కరీంనగర్ జిల్లా కోర్టుకు బుధవారం బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ఉదయం విధులకు హాజరైన కోర్టు అధికారులు కంప్యూటర్ లో మెయిల్స్ చెక్ చేస్తున్న క్రమంలో ఓ ఆగంతకుని నుంచి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కోర్టు ఏఓ వ
బాంబు బెదిరింపు


కరీంనగర్, 18 ఫిబ్రవరి (హి.స.)కరీంనగర్ జిల్లా కోర్టుకు బుధవారం బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ఉదయం విధులకు హాజరైన కోర్టు అధికారులు కంప్యూటర్ లో మెయిల్స్ చెక్ చేస్తున్న క్రమంలో ఓ ఆగంతకుని నుంచి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కోర్టు ఏఓ వెంటనే అలెర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు జిల్లా కోర్టుకు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో వచ్చి కోర్టులో అణువణువూ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే పోలీసులకు ఎక్కడా కూడా ఎలాంటి బాంబు ఆనవాళ్లు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాంబు ఉందన్న సమాచారం కోర్టులో న్యాయవాదులకు, కక్షిదారులకు ఆలస్యంగా తెలియడంతో తనిఖీలు ఎందుకు చేస్తున్నారో అనే ఆందోళన అందరిలో నెలకొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande