కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలి : ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్, 18 ఫిబ్రవరి (హి.స.) కంటోన్మెంట్ ను బల్దియాలో విలీనం చేయాలని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ డిమాండ్ చేశారు. కేంద్రం మరోసారి సివిలియన్ నామినేటెడ్ బోర్డు మెంబర్ ను నియమించడాన్ని నిరసిస్తూ బుధవారం కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ ను ఎమ్మెల్యే
ఎమ్మెల్యే గణేష్


సికింద్రాబాద్, 18 ఫిబ్రవరి (హి.స.)

కంటోన్మెంట్ ను బల్దియాలో విలీనం

చేయాలని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ డిమాండ్ చేశారు. కేంద్రం మరోసారి సివిలియన్ నామినేటెడ్ బోర్డు మెంబర్ ను నియమించడాన్ని నిరసిస్తూ బుధవారం కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ ను ఎమ్మెల్యే బహిష్కరించారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ను విలీనం చేయాలన్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని బ్రిగేడియర్ రాజీవ్ కు ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ విలీనం సాకుగా చూపిస్తూ కంటోన్మెంట్లో గత 5 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కేంద్రం ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించకపోవడానికి దేశంలో ఎమర్జెన్సీ ఏమైనా నడుస్తుందా..? అని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రశ్నించారు. తక్షణమే బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని లేదంటే కంటోన్మెంట్ పౌరులతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తానన్ని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande