
హైదరాబాద్, 18 ఫిబ్రవరి (హి.స.)
మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్
పరిధిలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. మంగళవారం అర్ధరాత్రి శాస్త్రి పురంలో గంజాయి గ్యాంగ్ స్థానికుల పై అరాచకం సృష్టించారు. స్థానికులపై పంచులతో విచక్షణారహితంగా ఐదు మంది పై దాడి చేశారు. అడ్డు వచ్చిన వారిపై పీడు గుద్దుల వర్షం కురిపించారు. అంతటితో ఆగకుండా పార్కింగ్ చేసిన వాహనాలను ధ్వంసం చేశారు. గంజాయి గ్యాంగ్ దాడిలో గాయపడ్డ క్షతగాత్రులను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపు గంజాయి గ్యాంగ్ పరారైంది. పారిపోతున్న గంజాయి బ్యాచ్ ను వెంబడించిన స్థానికులు ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఒక యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..