రంజాన్ ప్రారంభ వేళ ఫడ్నవిస్ సర్కార్ షాక్.. ముస్లిం రిజర్వేషన్లు పూర్తిగా రద్దు
ముంబయి,18 ,ఫిబ్రవరి (హి.స.) రంజాన్ ప్రారంభ వేళ మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ సర్కార్ భారీ షాకిచ్చింది. ముస్లిం రిజర్వేషన్లకు ముగింపు పలికింది. ముస్లింలకు కేటాయించే 5 శాతం కోటాను పూర్తిగా రద్దు చేసింది. పాత సర్క్యులర్లు, ఆదేశాలన్నింటినీ రద్దు చేస
రంజాన్ ప్రారంభ వేళ ఫడ్నవిస్ సర్కార్ షాక్.. ముస్లిం రిజర్వేషన్లు పూర్తిగా రద్దు


ముంబయి,18 ,ఫిబ్రవరి (హి.స.) రంజాన్ ప్రారంభ వేళ మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ సర్కార్ భారీ షాకిచ్చింది. ముస్లిం రిజర్వేషన్లకు ముగింపు పలికింది. ముస్లింలకు కేటాయించే 5 శాతం కోటాను పూర్తిగా రద్దు చేసింది. పాత సర్క్యులర్లు, ఆదేశాలన్నింటినీ రద్దు చేసింది.

విద్యలో ముస్లిం సమాజానికి 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తోంది. ఈ రిజర్వేషన్ ఆర్డినెన్స్ 2014 నుంచి అమలులోకి వచ్చింది. కానీ చట్టం లేకపోవడం, కోర్టు స్టేలు కారణంగా సంవత్సరాలుగా అనిశ్చితిలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా దానిని పూర్తిగా అధికారికంగా ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు ముస్లిం విద్యార్థులకు కళాశాలల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు కావు. అలాగే కుల ధృవీకరణ పత్రాలు కూడా జారీ కావు.

ప్రభుత్వ నిర్ణయంపై AIMIM ఎంపీ ఇంతియాజ్ జలీల్ తీవ్రంగా స్పందించారు. ‘‘రంజాన్ కానుకగా ప్రభుత్వం ముస్లింలకు 5 శాతం విద్యా రిజర్వేషన్లను రద్దు చేసింది. ముస్లింలలో అత్యధిక డ్రాపౌట్ రేటు ఉందని హైకోర్టు అంగీకరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande