ప్రాజెక్ట్ చీతాలో మరో చారిత్రాత్మక మైలురాయి.. మూడు పిల్లలకు జన్మనిచ్చిన చీతా 'గామిని
భోపాల్, 18 ఫిబ్రవరి (హి.స.) భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోని విదేశాల నుంచి చిరుత (cheetah) పులులను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ (Kuno National Park)లో సాదుతున్న విషయం తెలిసిందే. మొదట ఇక్కడకు వచ్చిన చిరుత పులులు ఒక్కొక్కటి
ప్రాజెక్టు చీత


భోపాల్, 18 ఫిబ్రవరి (హి.స.)

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా

తీసుకోని విదేశాల నుంచి చిరుత (cheetah) పులులను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ (Kuno National Park)లో సాదుతున్న విషయం తెలిసిందే. మొదట ఇక్కడకు వచ్చిన చిరుత పులులు ఒక్కొక్కటిగా ప్రాణాలు కోల్పోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ కొద్ది నెలల తర్వాత ' ప్రాజెక్టు చీత('Project Cheetah') సక్సెస్ కావడమే కాకుండా.. చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన గామిని (Gamini) అనే చీతా రెండోసారి తల్లిగా మారి, మూడు ఆరోగ్యకరమైన పిల్లలకు జన్మనిచ్చింది. భారత గడ్డపై ఇది 9వ విజయవంతమైన చీతా కాన్పు కావడం విశేషం. ఈ కొత్త అతిథుల రాకతో కునోలో జన్మించి, ప్రస్తుతం జీవించి ఉన్న చీతా పిల్లల సంఖ్య 27 కు చేరుకుంది.

భారత్ గడ్డపై పెరిగిన చీతాల సంఖ్య

గామిని పిల్లలతో కలిపి ప్రస్తుతం భారతదేశంలోని మొత్తం చీతాల సంఖ్య 38 కి పెరిగింది. దేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చీతాల పునరుద్ధరణ పథకం 2 (Project Cheetah) విజయానికి ఒక గొప్ప సంకేతం. అటవీ శాఖ సిబ్బంది, పశు వైద్య బృందాల నిరంతర శ్రమ, అంకితభావం వల్లే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందని అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాఫ్రికా నుండి చీతాలు భారత్కు వచ్చి సరిగ్గా మూడేళ్లు పూర్తయిన రోజే ఈ మూడు కొత్త పిల్లలు జన్మించడం గమనార్హం. గామిని మూడు బుజ్జి చీతాలు ఆరోగ్యంగా ఎదిగి, భారత వన్యప్రాణుల వైవిధ్యాన్ని మరింత పటిష్టం చేయాలని కోరుకుందామని సీఎం మోహన్ యాదవ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande