
,
అమరావతి, 18,ఫిబ్రవరి (హి.స.) :శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచిపై (2024కు ముందు) భక్తుల నుంచి వ్యక్తమైన అనేక అనుమానాలు, విమర్శలను పరిగణనలోకి తీసుకుని నెయ్యి కొనుగోలు విధానంలో పలు మార్పులు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రవాణా సమయంలో నెయ్యి నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు నిబంధనల్లో కీలక మార్పులు చేసినట్లు పేర్కొంది. టెండరు దక్కించుకున్న డెయిరీ సంస్థలు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ, ఎన్‌డీడీబీ నిబంధనల ప్రకారం అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాయని తెలిపింది. ఆవు నెయ్యి విషయంలో ఎన్‌డీడీబీ నిపుణులు సూచించిన ధరను పరిగణనలోకి తీసుకొన్నామని, టెండరు కేటాయింపులు అత్యంత పారదర్శకంగా జరిగాయని వివరించింది. శ్రీవారి ప్రసాదాల నాణ్యతను, పవిత్రతను కాపాడటానికి టీటీడీ బోర్డు కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. టీటీడీ ప్రకటనలో ముఖ్యాంశాలివీ..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ