దళారుల ఉచ్చులో పడొద్దు : అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
ఖమ్మం, 18 ఫిబ్రవరి (హి.స.) ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో మధ్యవర్తుల ప్రమేయాన్ని ఎంతమాత్రం సహించేది లేదని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెగేసి చెప్పారు. బుధవారం గండుగులపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో దమ్మపేట మండలానికి చెందిన లబ్ధిదార
MLA


ఖమ్మం, 18 ఫిబ్రవరి (హి.స.)

ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో మధ్యవర్తుల ప్రమేయాన్ని ఎంతమాత్రం సహించేది లేదని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెగేసి చెప్పారు. బుధవారం గండుగులపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో దమ్మపేట మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల చెక్కులను ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం నేరుగా అర్హులకే చేరాలన్నదే తన సంకల్పమని నొక్కి చెప్పారు. పథకాల మంజూరు పేరుతో ఎవరైనా మధ్యవర్తులు ఆశ చూపిస్తే వారిని నమ్మవద్దని, లబ్ధిదారులు నేరుగా సంబంధిత అధికారులనే సంప్రదించాలని ఆయన స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, దమ్మపేట మండలంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా తాను నిరంతరం కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామ్ నరేష్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వాసం రాణి, రెవెన్యూ అధికారులు సోయం బిక్షమయ్య, వంకా వీరస్వామి, ఎస్.డి. అలీ, జలీల్ పాషా, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande