ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక.. బీఆర్ఎస్కు బీజేపీ ఓపెన్ ఆఫర్
నిర్మల్, 18 ఫిబ్రవరి (హి.స.) నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ కు బీజేపీ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. చైర్మన్ పదవి మీరు తీసుకున్నా ఓకే.. మాకు ఇచ్చినా ఓకే అంటూ.. బీజేపీ నేత రాష్ట్ర క
బిఆర్ఎస్ ఆఫర్


నిర్మల్, 18 ఫిబ్రవరి (హి.స.)

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ కు బీజేపీ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. చైర్మన్ పదవి మీరు తీసుకున్నా ఓకే.. మాకు ఇచ్చినా ఓకే అంటూ.. బీజేపీ నేత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకుల శ్రీనివాస్ ఆఫరిచ్చారు. మీకు మేము, మాకు మీరు.. ఇద్దరం కలిసి నడిస్తేనే చైర్మన్ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. చైర్మన్ పదవి మీరు తీసుకుంటే మాకు వైస్ చైర్మన్, మాకు చైర్మన్ ఇస్తే.. మీరు వైస్ చైర్మన్ పదవి తీసుకోండంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడంతో.. ఖానాపూర్ లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దేనికైనా సిద్ధంగానే ఉన్నామని, బీఆర్ఎస్ ముందుకు రావడమే ఆలస్యమన్నారు. బీజేపీ ఇచ్చిన ఈ ఆఫర్ పై బీఆర్ఎస్ నేతల రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది. ఆ పార్టీ ఇన్ఛార్జ్ నేత జాన్సన్ నాయక్ ఇందుకు సిద్ధంగానే ఉన్నారన్న సంకేతాలు వస్తున్నాయి. చైర్మన్ కాలపరిమితిని చెరిసగం పంచుకుందామని భావించడంతో.. ఖానాపూర్ చైర్మన్ ఎన్నిక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు చెక్ పెట్టేందుకే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande