గో వ్యధ .. ఒకే కంటైనర్ లో 75 గోవులు అక్రమంగా తరలింపు
భద్రాచలం, 18 ఫిబ్రవరి (హి.స.)ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా... గోవుల అక్రమ రవాణా ఆగడం లేదు. దొడ్డిదారిలో అనుమతులు పొంది కొందరు బయటకు కనిపించకుండా కంటైనర్లలో పశువులను వధశాలలకు తరలిస్తున్నారు. బుధవారం భద్రాచలం పట్టణంలో హృదయం ద్రవించే సంఘటన చోటు చేసుకుంద
గోవుల రవాణా


భద్రాచలం, 18 ఫిబ్రవరి (హి.స.)ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా... గోవుల అక్రమ రవాణా ఆగడం లేదు. దొడ్డిదారిలో అనుమతులు పొంది కొందరు బయటకు కనిపించకుండా కంటైనర్లలో పశువులను వధశాలలకు తరలిస్తున్నారు. బుధవారం భద్రాచలం పట్టణంలో హృదయం ద్రవించే సంఘటన చోటు చేసుకుంది. ఒక కంటైనర్ లో 75 పశువులను కుక్కి కుక్కి హైదరాబాద్ తరలిస్తుండగా, భద్రాచలం పోలీసులు వాహనాన్ని పట్టుకుని గోవులను పాల్వంచలోని గోశాలకు తరలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా గోవులను తరలిస్తున్న వ్యక్తుల పై కేసు నమోదు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కనీసం నిలబడే స్థలం కూడా లేకుండా పశువుల కొమ్ములు, కాళ్ళు విరిచి వధశాలలకు తరలించడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande