ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక పై స్టే ఎత్తివేసిన హైకోర్టు
రంగారెడ్డి, 18 ఫిబ్రవరి (హి.స.) తీవ్ర ఉత్కంఠతో, భారీ పోలీసు బందోబస్తుల మధ్య రెండు రోజులుగా కొనసాగిన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక పై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యా
మున్సిపాలిటీ


రంగారెడ్డి, 18 ఫిబ్రవరి (హి.స.) తీవ్ర ఉత్కంఠతో, భారీ పోలీసు బందోబస్తుల మధ్య రెండు రోజులుగా కొనసాగిన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక పై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని ఇబ్రహీంపట్నం పోలీసులు బుధవారం ఉదయం హైకోర్టులో హాజరుపరిచారు. అయితే, ఫలితాలు వెల్లడైన తర్వాత బలవంతంగా నన్ను రెండు రోజులు చీరాలలోని రిసార్ట్స్లో ఉంచారని, హైకోర్టు ఉత్తర్వులతో నిన్న కౌన్సిల్ మీటింగ్ కు హాజరు అయ్యానని ఆకుల యాదగిరి హైకోర్టు ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. హైకోర్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక పై విచారణ జరిపి గతంలో ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది. జిల్లా కలెక్టర్ దే తుది నిర్ణయం అని హై కోర్టు ప్రకటించింది. దీంతో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయ్యింది. జిల్లా కలెక్టర్ ఎన్నిక పై ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande