
షాద్నగర్, 18 ఫిబ్రవరి (హి.స.)
దైవ దర్శనం ముగించుకుని ఇంటికి
వారు చేరుకుంటామనుకున్న వారిని గుర్తు తెలియని వాహనం రూపంలో మృత్యువు కబలించింది. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్కు చెందిన పుల్లగుర్రం పురుషోత్తం రెడ్డి, గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డి మరో ముగ్గురితో కలిసి తీర్థయాత్ర నిమిత్తం అరుణాచలం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇంటికి బయలుదేరారు. ప్రయాణిస్తున్న ఇన్నోవా క్రిస్టాను షాద్ నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారి 44 పై మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం బలంగా ఢీ కొనడంతో, కారులో ముందువరుసలో కూర్చున్న పుల్లగుర్రం పురుషోత్తం రెడ్డి, గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. జరిగిన ప్రమాదం పై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కు
రోడ్డు ప్రమాదం పై ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి..
రాయికల్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారి 44 పై మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడం పట్ల షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సందర్శించి సంతాపం తెలిపారు. మృతదేహాలకు తక్షణమే పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించాలని ఎమ్మెల్యే వైద్యులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..