ఎయిర్ పోర్ట్ లో ఫేక్ కస్టమ్స్ అధికారి భారీ మోసం..
హైదరాబాద్, 18 ఫిబ్రవరి (హి.స.) రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి వ్యాపారవేత్తను మోసం చేసి రూ.75,000 నగదు దోచుకెళ్లిన సంఘటన ఆర్టీఐ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదరాబాద్ మ
ఎయిర్పోర్ట్


హైదరాబాద్, 18 ఫిబ్రవరి (హి.స.)

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్

పోర్ట్ లో కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి వ్యాపారవేత్తను మోసం చేసి రూ.75,000 నగదు దోచుకెళ్లిన సంఘటన ఆర్టీఐ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

హైదరాబాద్ మెట్టుగూడకు చెందిన వ్యాపారవేత్త గ్యామ్ ఆల్ఫ్రెడ్ (53) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం సుమారు 9 గంటలకు విమానాశ్రయంలోని తన కూల్డ్రింక్ దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి తాను కస్టమ్స్ అధికారి అని చెప్పి తన వద్ద రెండు ఐఫోన్లు, బంగారు వస్తువులు ఉన్నాయన్నారు. తక్కువ ధరకే విక్రయిస్తానని నమ్మబలికాడు. మాటలను నమ్మిన బాధితుడు రెండు ఐఫోన్లను రూ.1,00,000 కొనుగోలు చేయడానికి ఒప్పుకున్నాడు. నిందితుడి సూచన మేరకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎయిర్పోర్ట్ డిపార్చర్ ప్రాంతంలో కలుసుకుని మొదట రూ.70,000 నగదు చెల్లించాడు. అనంతరం మరో రూ.5,000 ఇవ్వాలని కోరడంతో మొత్తం రూ.75,000 అందజేశాడు. డబ్బు తీసుకున్న తర్వాత కొద్దిసేపట్లో ఫోన్లు తీసుకువస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తెలియని వ్యక్తి పై మోసం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది ఇలాంటి మోసపూరిత ఆఫర్లకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఇన్స్పెక్టర్ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande