తిరుమల కల్తీ నెయ్యిపై చర్చకు పట్టు.. బొత్స vs లోకేశ్
అమరావతి, 18 ఫిబ్రవరి (హి.స.) ఏపీ శాసనమండలిలో తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంపై చర్చకు వైసీపీ పట్టుబడుతోంది. నిన్న కూడా ఇదే విషయమై వైసీపీ తీర్మానం ఇవ్వగా.. దానిని ఛైర్మన్ తిరస్కరించారు. నేడు కూడా మండలిలో అదే సీన్ రిపీటైంది. ఇందాపూర్, హెరిటేజ్ నెయ్యి స
బొత్స


అమరావతి, 18 ఫిబ్రవరి (హి.స.)

ఏపీ శాసనమండలిలో తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంపై చర్చకు వైసీపీ పట్టుబడుతోంది. నిన్న కూడా ఇదే విషయమై వైసీపీ తీర్మానం ఇవ్వగా.. దానిని ఛైర్మన్ తిరస్కరించారు. నేడు కూడా మండలిలో అదే సీన్ రిపీటైంది. ఇందాపూర్, హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చకు తీర్మానాన్ని అందజేయగా.. ఛైర్మన్ మోషేన్ రాజు దానిని డిస్మిస్ చేశారు. దీంతో మండలి విపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో ఇందాపూర్, హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీలో ఈ వ్యవహారంపై చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని, అందుకే మండలిలో చర్చకు డిమాండ్ చేస్తున్నామన్నారు.

బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీ లాబీలో నిర్వహించిన చిట్ చాట్ లో స్పందించారు. మండలిలో వైసీపీ నేతలపై బొత్స సత్యనారాయణ పట్టు కోల్పోయారన్నారు. వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు వేర్వేరుగా వాయిదా తీర్మానాలు ఇచ్చారని, ఒకరు లడ్డూకల్తీపై చర్చించాలని, మరొకరు ఇందాపూర్ డెయిరీపై చర్చించాలని అడిగారని పేర్కొన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీల్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలని ఆసక్తిగా ఉందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande