చెన్నై ఈ సీ ఆర్ ప్రాంతంలో పట్టపగలే దంపతుల దారుణ హత్య
: చెన్నై18 ఫిబ్రవరి (హి.స.) ఈసీఆర్‌ ప్రాంతంలో పట్టపగలే దంపతులను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. పోలీసుల కథనం మేరకు... చెన్నై ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డులోని కానత్తూర్‌రెడ్డి కుప్పం భారతిదాసన్‌ వీధికి చెందిన పార్థసారథి(42), జమున దంపతులు. వీరి
చెన్నై ఈ సీ ఆర్ ప్రాంతంలో పట్టపగలే దంపతుల దారుణ హత్య


: చెన్నై18 ఫిబ్రవరి (హి.స.) ఈసీఆర్‌ ప్రాంతంలో పట్టపగలే దంపతులను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. పోలీసుల కథనం మేరకు... చెన్నై ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డులోని కానత్తూర్‌రెడ్డి కుప్పం భారతిదాసన్‌ వీధికి చెందిన పార్థసారథి(42), జమున దంపతులు. వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో రెండేళ్ల క్రితం జమున పిల్లలను తీసుకుని సైదాపేటలోని సోదరి ఇంటికి వెళ్లింది. దీంతో పార్థసారథి ఒంటరిగా ఉంటున్నాడు.

అతని ఎదురింట్లో ఉంటున్న సుశీల్‌కి పార్థసారథి భార్య జమునకు వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. సుశీల్‌ కారణంగానే తన భార్య వదిలి వెళ్లిపోయిందని పార్థసారథి అతనిపై పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సుశీల్‌ భార్య గిరిజతో వాహనం పార్కింగ్‌ విషయంలో పార్థసారథి గొడవపడ్డాడు. ఆక్రోశంతో ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి సుశీల్‌(35), గిరిజ(29)పై విచక్షణ రహితంగా దాడిచేశాడు. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరికి ఏడు, నాలుగేళ్ల వయసున్న కుమారులున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande