
ముంబయి,18 ,ఫిబ్రవరి (హి.స.) భారత ఏఐ ప్రయాణంలో గూగుల్ భాగస్వామి కావాలనుకుంటోందని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) పేర్కొన్నారు. ఏఐ వినియోగంతో మరికొన్నేళ్లలో భారత్ మరింత ముందుకువెళ్తుందని తాను నమ్ముతున్నానని.. అందువల్లే ఆ దేశంతో భాగస్వామిగా ఉండాలనే స్పష్టమైన ఆశయంతో ఉన్నామన్నారు. ఏఐ సమిట్‌పై కాలిఫోర్నియా నుంచి జాతీయ మీడియాతో వర్చువల్‌గా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌లో ఈ మార్పు సాధ్యం కావడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, స్థిరమైన పెట్టుబడులు, డేటాసెంటర్‌ల ఏర్పాటు, స్థానిక భాగస్వాములతో కలిసి పరిశోధనలు నిర్వహించడం, దేశంలోని ప్రతిభావంతులైన యువతకు దేశ, విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు సృష్టంచడం కోసం చర్యలు తీసుకుంటామన్నారు.
భారత్‌లో క్లౌడ్ రీజియన్‌ను స్థాపించడానికి గూగుల్ (Google) రిలయన్స్ జియో (Reliance Jio)తో కలిసి పనిచేస్తోందని పిచాయ్ పేర్కొన్నారు. ఇందులోభాగంగా రాజస్థాన్‌లో 150 మెగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్‌లను ఏర్పాటుచేస్తోందన్నారు. భారత్‌లో గూగుల్ డేటా సెంటర్‌ను విస్తరించడానికి అదానీ, క్లీన్‌మాక్స్ వంటి సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ