ఢిల్లీలో మాయావతికి ప్రత్యేక బంగ్లా కేటాయింపు..
ఢిల్లీ,18 ,ఫిబ్రవరి (హి.స.) ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ వ్యూహాలు మారుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతికి దేశ రాజధాని ఢిల్లీలో టైప్-8 బంగ్లాను కేంద్రం కేటాయించింది. టైప్-8 బంగ్లాలను కేవలం కేంద్
BSP is the only party that depends on the earnings of poor workers Mayawati


ఢిల్లీ,18 ,ఫిబ్రవరి (హి.స.) ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ వ్యూహాలు మారుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతికి దేశ రాజధాని ఢిల్లీలో టైప్-8 బంగ్లాను కేంద్రం కేటాయించింది. టైప్-8 బంగ్లాలను కేవలం కేంద్రమంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతులకు కేటాయిస్తారు. అలాంటి టైప్-8 బంగ్లాను తాజాగా మాయావతికి కేటాయించడంపై పొలిటికల్‌గా రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. వదంతులు వ్యాప్తి చెందడంతో మాయావతి రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు.

భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలో టైప్-8 బంగ్లాను కేటాయించారని.. ఇందులో ఎలాంటి వ్యూహాలు లేవని మాయావతి స్పష్టం చేశారు. తప్పుడు పుకార్లను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల వ్యూహాన్ని తెలియజేశారు. ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలను కార్యకర్తలెవరూ నమ్మొద్దని సూచించారు.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande