
తిరుమల , 18 ఫిబ్రవరి (హి.స.)
కలియుగ ఇలవైకుంఠంగా ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ వేలసంఖ్యలో భక్తులు తరలివెళ్తారు. బుధవారం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. కేవలం నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండగా.. టోకెన్లు లేనివారికి 6 గంటలు, సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారికి 3-4 గంటల్లో స్వామివారి దర్శనం జరుగుతుందని టీటీడీ పేర్కొంది. కొత్తగా కంపార్టుమెంట్లలోకి వెళ్లేవారికి దర్శనానికి 6-8 గంటల సమయం పట్టవచ్చని తెలిపింది. రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శనానికి 2-3 గంటల సమయం పడుతుంది. నిన్న (మంగళవారం) స్వామివారిని 70,509 మంది భక్తులు దర్శించుకోగా.. 18,058 మంది స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు.
తొండమాన్‌పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 16న ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు 24 వరకూ జరగనున్నాయి. ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల వరకూ వాహనసేవలు జరగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు హంసవాహనంపై ఊరేగారు. నేడు సింహవాహనంపై స్వామివారు భక్తులకు అభయమివ్వనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV