
హైదరాబాద్, 18 ఫిబ్రవరి (హి.స.)
ఈ ఏడాది ఓ అరుదైన ఆధ్యాత్మిక
సంఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది క్రిస్టియన్ల లెంట్ (Lent), ముస్లింల రంజాన్ (Ramadan) ఉపవాస దీక్షలు దాదాపు ఒకేసారి ప్రారంభమవుతున్నాయి. ఇది చాలా అరుదైన సంఘటనగా భావిస్తున్నారు. సుమారు 33 సంవత్సరాల తర్వాత ఇలా రెండు మతాల ఉపవాస దీక్షలు ప్రత్యేకతను సంతరించుకుంది. గతంలో 1993లో లెంట్, రంజాన్ కలిసి రావడం చాలా దీక్షలు ఒకేసారి ప్రారంభం కాగా.. మళ్ళీ 33 ఏళ్ల తర్వాత ఈ ఏడాది అలాంటి అరుదైన సమయం సంభవించడం రెండు మతాల వారు విశేషంగా భావిస్తున్నారు.
రంజాన్.. చాంద్రమాన క్యాలెండర్
రంజాన్ పూర్తిగా ఇస్లామిక్ చాంద్రమాన కాలెండర్ ఆధారంగా ఉంటుంది. చాంద్రమాన (చంద్రుడి ఆధారంగా) సంవత్సరము సూర్యమాన(సూర్యుని ఆధారంగా) సంవత్సరంతో పోలిస్తే సుమారు 10-11 రోజులు చిన్నది. అందువల్ల ప్రతి సంవత్సరం రంజాన్ సుమారు 10-11 రోజులు ముందుగా వస్తుంది. ఈ విధంగా 33 సంవత్సరాలకు ఒకసారి పూర్తి చక్రం పూర్తవుతుంది. 1447 హిజీ నెలవంక దర్శనంతో ఉపవాసాలు మొదలు పెడతారు. సౌదీ అరేబియా, UAE, ఇతర గల్ఫ్ దేశాల్లో నిన్ననే చంద్రవంక దర్శనం ఇవ్వడంతో.. నేటి నుంచి ప్రపంచం అంతా ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి.
లెంట్.. సూర్యమాన క్యాలెండర్
మరోవైపు క్రిస్టియన్ సంప్రదాయంలో లెంట్ Ash Wednesday (బూడిద బుధవారం)తో ప్రారంభమవుతుంది. ఈ ఏడాది Ash Wednesday కూడా ఫిబ్రవరి 18న వచ్చింది. నేటి నుంచి ఈస్టర్ వరకు 40 రోజులు వీరి ఉపవాస దీక్షలు కొనసాగుతాయి.
క్రిస్టియన్ లెంట్ మాత్రం గ్రెగోరియన్ సర్యమాన కాలెండర్ ప్రకారం నిర్ణయించబడుతుంది. అందుకే. ఈ రెండు ఉపవాస కాలాలు ఖచ్చితంగా ఒకేసారి చాలా అరుదుగా మాత్రమే ప్రారంభమవడం జరుగుతుంది.
ఈ కాలంలో రెండు మతాల వారూ కఠిన ఉపవాసాలతో, ప్రార్థనలు, దానధర్మాలు చేస్తూ, ఆత్మపరిశీలనకు ప్రాధాన్యత ఇస్తారు. ఇరు మతాల పెద్దల ప్రకారం.. పరస్పర గౌరవం, శాంతి, సామరస్యానికి ఇది ఒక మంచి అవకాశం అంటున్నారు. భిన్న మతాలవారు ఒకేసారి ఆధ్యాత్మిక ప్రార్థనల్లో పాల్గొనడం సమాజంలో ఐక్యతకు చిహ్నం అని భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..