రాష్ట్రంలో రోడ్లు సౌకర్యం కొన్ని.తండాలు గిరిజన. గు డేలు 227 మారుమూల పల్లెలు
అమరావతి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసలు రోడ్డు సౌకర్యం లేని తండాలు, గిరిజన గూడేలు, మారుమూల పల్లెలు 227 ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. చాలాచోట్ల దశాబ్దాల కిందట మట్టి, మొరంతో వేసిన కాలిబాటలే కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాలకు బస్సులు, వాహనాలు వెళ్లే పరిస
రాష్ట్రంలో రోడ్లు సౌకర్యం కొన్ని.తండాలు గిరిజన. గు డేలు 227 మారుమూల పల్లెలు


అమరావతి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసలు రోడ్డు సౌకర్యం లేని తండాలు, గిరిజన గూడేలు, మారుమూల పల్లెలు 227 ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. చాలాచోట్ల దశాబ్దాల కిందట మట్టి, మొరంతో వేసిన కాలిబాటలే కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాలకు బస్సులు, వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్రవాహనాల రాకపోకలు సైతం అత్యంత సమస్యాత్మకంగా మారాయి. దాంతో వైద్యం, అగ్ని ప్రమాదాలు, విపత్తుల్లాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడానికి... రైతులు పంట ఉత్పత్తులను తరలించడానికి నానా అగచాట్లు పడుతున్నారు. వర్షాకాలంలో అయితే ఈ ప్రాంతాలు ద్వీపాలుగా మారిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా సర్వే చేసి రోడ్లు లేని గ్రామాలను గుర్తించింది.

నిధుల కొరత, ఇతర కారణాలతో 193 గ్రామాల్లో, అటవీశాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో 34 గ్రామాలు సౌకర్యం లేని తండాలు, గిరిజన గూడేలు, మారుమూల పల్లెలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande