
అమరావతి, 19 ఫిబ్రవరి (హి.స.):ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలతో సభను మొదలుపెట్టారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయానికి మంజూరు చేయబడిన పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఎప్పుడు అని ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ప్రశ్నించారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ సమాధానమిచ్చారు. రూ.139 కోట్లు శాంక్షన్ చేశామని... దాంట్లో రూసా కింద రూ.55 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఏ కార్యక్రమం చేసినా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకుంటున్నామని తెలిపారు. కర్నూలు పార్లమెంట్ చుట్టు పక్కల ఎక్కవ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. క్లస్టర్ యూనివర్సిటీల్లో ఫోకస్ సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. అందుకే స్పెషలైజేషన్‌లపైనా శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. బ్యాలెన్స్ పనులు వచ్చే అకాడమిక్ ఇయర్‌లో పెండింగ్ నిధులు మంజూరు చేస్తామని మంత్రి లోకేశ్ సభలో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ