
అమరావతి, 19 ఫిబ్రవరి (హి.స.)
పల్నాడు జిల్లా:వినుకొండలో భూ ప్రకంపనల )ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఇవాళ(గురువారం) తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో వినుకొండ)తో పాటు నడిగడ్డ, దర్శి పరిసర ప్రాంతాల్లో 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఏం జరుగుతుందో అని భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.5గా నమోదైనట్లు జాతీయ భూకంప పరిశోధన కేంద్రం వెల్లడించింది.
భూకంప కేంద్రం వినుకొండకు వాయవ్య దిశలో 20 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ధ్రవీకరించింది. అదృష్టవశాత్తూ ఈ ప్రకంపనల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ