
అమరావతి, 19 ఫిబ్రవరి ( హిం.స, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐటీలో అతిపెద్ద పెట్టుబడిగా గూగుల్ డేటా సెంటర్ నిలిచింది. గూగుల్ ప్రకటించినప్పటి నుంచి వైకాపా నాయకులు భూసేకరణ జరగకుండా పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. అవాంతరాలన్నింటినీ అధిగమించి రైతులను ఒప్పించి పరిహారం జమ చేశారు. ఈ ప్రక్రియలో మిగిలిన ఆఖరి రైతు సైతం భూమి ఇచ్చేందుకు ముందుకు రావడంతో డేటా సెంటర్‌కు మార్గం సుగమమైంది. వచ్చే నెలలో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్న
..:వైకాపా నాయకుల కుట్రలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇటీవల సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎకరాకు రూ.17లక్షల పరిహారాన్ని రూ.40లక్షలకు పెంచడంతోపాటు, 20 సెంట్ల స్థలం ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రికార్డుల్లోకి ఎక్కని శివాయ్ జమేదార్ భూముల్లో ఉన్న రైతులకు ఎకరాకు రూ.10లక్షల పరిహారం పెంచుతూ జీవో ఇచ్చారు. అలాగే ఇంటికో ఉద్యోగం, ఉపాధి కోసం షాపింగ్ కాంప్లెక్స్‌లో ఒక దుకాణం, బంజరు భూముల అభివృద్ధి పథకం కింద 520 మంది రైతులకు 3సెంట్ల నివాస స్థలాలు ఇస్తామని చెప్పడంతో రైతులు భూసేకరణకు ఒప్పుకొన్నారు.
:ఇప్పటి వరకు భూసేకరణకు నిరాకరించిన రైతు గణేశ్ సైతం భూమి ఇచ్చేందుకు ముందుకొచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కలిసి 1.94 ఎకరాల అసైన్డ్ భూమి ఇస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు మండల రెవెన్యూ అధికారులను కలిసి అంగీకార పత్రాలను సమర్పించినట్లు రైతు వెల్లడించారు.
-
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ