
, కడప: 19 ఫిబ్రవరి (హి.స.)
నందలూరులో కొందరు భూ బకాసురుల అవతారమెత్తారు. వైకాపా అధికారంలో ఉండగా ఇష్టారీతిన వ్యవహరించారు. ప్రభుత్వ, అటవీ భూముల్లో పాగా వేశారు. యాజమాన్య హక్కుల్లోని లొసుగులను అడ్డుపెట్టుకుని అతి ఖరీదైన భూములను గుటుక్కుమనిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. పోలీసు, రెవెన్యూ అధికారులు ఇంకా వత్తాసు పలుకుతూనే ఉన్నారు. దీంతో సామాన్యులు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితి తలెత్తింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అరాచకపర్వంపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ