
అమరావతి, 19 ఫిబ్రవరి (హి.స.) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ నెల 24, 25, 26 తేదీల్లో నిర్వహించనున్న ఆటల పోటీలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా క్రీడల ఎంపిక, విజేతలకు అందించే ట్రోఫీలు, వారికి అందించే క్రీడా దుస్తులు (జెర్సీ)పై చర్చించారు. పరుగు పందెం, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, చెస్, క్రికెట్, టెన్నికాయిట్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బాడ్మింటన్, షాట్‌పుట్, క్యారమ్స్, మ్యూజికల్ చైర్స్ వంటి క్రీడలను నిర్వహించాలని నిర్ణయించారు. సమీక్ష సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, క్రీడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్, ప్రభుత్వ విప్ జీవీ ఆంజనేయులు, శాప్ చైర్మన్ రవినాయుడు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ